మాస్క్ ధరించని వారిపై కొరడ...ఎస్.ఐ.నగేశ్వర్ రావు
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసారి
పెన్ పవర్, మల్కాజిగిరి
సెకండ్ వేవ్ కోవిడ్ - 19, కరోనా విజృంభిస్తున్న నేఫధ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పటించి, శానిటైజర్ తో ఎప్పటికప్పడు శుభ్రం చేసుకొవాలని, కోవిడ్ వైరస్ నుండి సురక్షితంగా నగర ప్రజలు ఉండాలని ట్రాఫిక్ ఎస్.ఐ.నగేశ్వర్ రావు ఆద్వర్యంలో ఎల్లారెడ్డిగూడ, రాఘవేంద్రకాలనీలో రాచకొండ సిపి ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్దంగా మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం తిరుగుతున్న పలువురు వాహనదారులకు చట్ట ప్రకారం 1000రూ చొప్పున జరిమానాలు విధించి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ సందర్బంగా ఎస్.ఐ నగేశ్వర్ రావు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 22మంది పై కేసులు నమోదు చేసి 1000రూ జరిమాన విధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా ముగ్గురు వాలెంటేర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment