Followers

వరంగల్ నగర ఎన్నికల్లో

వరంగల్ నగర ఎన్నికల్లో..

అత్యధిక స్థానాల్లో బిజెపి జెండా ఎగరడం కాయం

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు సునీల్ రెడ్డి


రామగుండం ,  పెన్ పవర్ 

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల 50వ, డివిజన్  బిజేపి అభ్యర్థి  గార్లపాటి మంజుల రెడ్డి, మరియు 31వ, డివిజన్ అభ్యర్థి కడవెరపు శ్రీనివాస్ ల  గెలుపు కొరకు  జులైవాడ, రెవెన్యూ కాలనీ మరియు షాంపేట లో బిజెపి నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఇంటి ఇంటి కి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయస మాట్లాడుతూ తెరాస పాలనలో కెసిఆర్ తన కుటుంబానికి తప్ప రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదని, రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టి పనికి రాని ప్రాజెక్టులు కడుతున్నారు కానీ గత ఏడాది నర్ధం నుండి కరోనాతో రాష్ట్ర ప్రజల ప్రాణాలు హరించుకుపోతుంటే  ఆక్సీజన్ జెనెరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే కనీస ఇంకిత జ్ఞానం లేని దుస్థిలో ఈ రోజు తెరాస ప్రభుత్వం ఉందని  కేంద్ర ప్రభుత్వం  తీసుకు వచ్చిన కేఎంసీ హాస్పిటల్ లో కనీసం 30 కోట్లు ఖర్చు కూడ తెరాస ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని, అదే వరంగల్ లో అయితే ప్రైవేట్ హాస్పిటల్ లకు సిఎం కెసిఆర్ కొమ్ము కాస్తున్నారని ఇక అసలు విషయానికి వస్తే మున్సిపల్ కార్పోరేషన్ డివిజన్లను, డివిజన్లలోని ప్రజలను పాటించుకొనే నాథుడే లేడని ఎటు చూసిన మురికి నీరు అశుభ్రతతో కంపు వాసన వస్తుందని తెరాస ప్రభుత్వం ఎన్నేళ్ళు అధికారంలో ఉన్న ప్రజలకు ఈ ఇబ్బందులు తొలగవని వారికి స్పష్టంగా అర్థమైతున్నదని అందుకే ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని దీనికి నిదర్శనమే గత జిహెచ్ఎంసి ఎన్నికలు నిదర్శణమని దీంతో   గ్రేటర్ వరంగల్ లో కూడ ప్రజలు బిజెపి అభ్యర్థులను ఎన్నుకోవడానికి సంసిధ్ధంగా ఉన్నారని జివిఎంసి లో అత్యధిక స్థానాలతో బిజెపి జెండా ఎగరవేయడం కాయమని ఆయన ధీమ వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...