కరోనాపై పోరులో తెలంగాణకు మోడీ సర్కార్ ఆపన్నహస్తం
తాండూర్, పెన్ పవర్మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనాపై పోరులో తెలంగాణ రాష్ట్రానికి రూ. 7151.8 కోట్లు విడుదల చేసిందన్నారు. గత సంవత్సరం రైతులకు రూ.696 కోట్లు, ఉజ్వల లబ్దిదారులకు రూ. 180 కోట్లు,మహిళల జనధన్ ఖాతాలో రూ. 789 కోట్లు, వృద్దాప్య, వితంతు ,దివ్యాంగ పెన్షనర్లకు రూ. 68.1 కోట్లు, ఉచిత పంపిణి బియ్యానికి రూ. 1261.44 కోట్లు, ఉచిత పంపిణి పప్పుకు రూ. 262.60 కోట్లు మంజూరు చేసి కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకున్నదని అంతేగాక సెకండ్ వేవ్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మే మరియు జూన్ మాసాల్లో కుటుంబంలో ఒక్కొక్కరికి ఉచితంగా ప్రతి నెల వచ్చే రేషన్ 5కిలోలు మోడీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం/ గోధుమలు 5 కేజీ మొత్తం 10 కిలోల బియ్యం ఇస్తామని కేంద్రం ప్రకటించడం హర్షనీయం అన్నారు. తెలంగాణకు 260 టన్నుల ఆక్సీజన్ అవసరముంటే కేంద్రం 400 టన్నుల ఆక్సీజన్ కేటాయించడంతో పాటు ప్రతి ఒక్కరికి ఉచితంగా కోవిడ్ 19 వాక్సిన్ అందిస్తుందన్నారు.దేశ ప్రజల కోసం మోడీ ఇంత చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి రేవెల్లి రాజలింగు, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, సీనియర్ నాయకులు వై తుకారాం, మండల ఉపాధ్యక్షులు కోమండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు దూడపాక భరత్,పట్టెం విష్ణుకళ్యాణ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, నాయకులు సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment