Followers

మాస్కులు ధరించని వ్యక్తులకు జరిమనాలు

 మాస్కులు ధరించని వ్యక్తులకు జరిమనాలు

12 మంది పై కేసులు నమోదు


మంచిర్యాల,  పెన్ పవర్

మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  జైపూర్ సెంటర్ లో ఎస్సై రామక్రిష్ణ తన సిబ్బందితో కలిసి  గురువారం కిరాణా షాపుల్లో, హోటళ్లలో చికెన్, మటన్ షాపుల్లో  మాస్కులు ధరించకుండా విక్రయిస్తున్న 12 మంది యజమానుల మీద 188 ఐపిసి, 51(బి) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పెట్టీ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగాఎస్సై మాట్లాడుతూ, కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో జైపూర్ మండలంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించినా ఇకనుండి ఎవరైనా మాస్కులు ధరించనట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై రామక్రిష్ణ హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...