రోడ్డు బాధితులు రోడ్డెక్కారు...
చిత్తూరు - తచ్చుర్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు బాధితులు రోడ్డెక్కారు. తమ భూములకు ప్రభుత్వం న్యాయబద్దంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు.చిత్తూరు - తచ్చుర్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్ బాధితులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు నిరసన వ్యక్తం చేశారు. గంగాధర్ నెల్లూరు, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం , చిత్తూరు తదితర మండలాల పరిధిలో రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఎక్స్ప్రెస్ హైవే కోసం ప్రభుత్వం భూసేకరణకు చర్యలు చేపట్టింది. అయితే ప్రధాన రహదారి వెంబడి భూములను తీసుకుంటున్న ప్రభుత్వం న్యాయబద్దంగా పరిహారం చెల్లించక పోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం మార్కెట్ విలువల ఆధారంగా ఎకరా భూమి కి 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో పద్మనాభ నాయుడు పాండురంగ దేవరాజులు శ్రీనివాసులు తదితర రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment