చెరువులో బట్టలుతికేందుకు వెళ్లి తల్లి,కుమారుడు మృతి చెందిన సంఘటన
చిత్తూరు, పెన్ పవర్
కొలమాసనపల్లి గ్రామానికి చెందిన లోకనాదాచారి భార్య జ్యోతమ్మ (35) కుమారుడు సురేంద్ర (10) ను లోకనాదాచారి బట్టలు ఉతికేందుకు సమీపంలో ఉన్న కురప్పల్లి చెరువు దగ్గర వదలి తన పనికి వెళ్ళిపోయాడు. జ్యోతమ్మ బట్టలుతుకుతున్న క్రమంలో సురేంద్ర ఈత కొడుతూ నీటిలో మునిగిపోయాడు. గమనించిన జ్యోతమ్మ కుమారుడిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. సమీపంలో పశువుల కాపరి శివ, జ్యోతమ్మ కేకలు విని కాపాడేందుకు ప్రయత్నించాడు. అప్పటికే వారు పూర్తిగా నీటిలో మునిగి మరణించారు. వారిని ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment