స్వచ్ఛత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సహయ కార్యక్రమాలు
ఎలమంచిలి, పెన్ పవర్
ఎలమంచిలి నెహ్రూ నగర్, ద్వారకా నగర్ యువకులు స్వచ్ఛత ఆర్గనైజేషన్ స్థాపించి ఉన్నారు. దీని ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు అనగా శుక్రవారం ఎలమంచిలి ఎన్జీవో హోం నందు 20 మందికి దివ్యాంగులు,వృద్ధులు మరియు పేదవారికి మూడు చక్రాల సైకిల్,బియ్యం, దుప్పట్లు మరియు పళ్ళు,మాస్కులు,శానిటైజర్, పెద్దల చేతుల మీద పంచడం జరిగింది.గాంధీజీ,మదర్ తెరిస్సా పటాలకు పూలమాల వేసి కార్యక్రమం మొదలు పెట్టి ఉన్నారు.
మొదటగా చార్టెడ్ అకౌంట్ బంగారు శెట్టి, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి బోదె పు గోవింద్, స్వచ్ఛత ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గోకివాడ శ్రీను,సెక్రెటరీ కొత్తలంక రాజేష్, మరియు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎస్కే అబ్దుల్లా మాస్టర్,సంఘ వ్యవస్థాపకులు కొత్తలంక ప్రసాద్ బాబు,13 వ వార్డు కౌన్సిలర్ గుప్తా,మరియు టి టి అప్పారావు,వెలుపల శేఖర్ బాబు, మనం మనం చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గోపి, సెక్రటరీ సురేష్,25 వ వార్డు కౌన్సిలర్ సంతోష్, అలాగే స్వచ్ఛత ఆర్గనైజేషన్ సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment