ఘనంగా కవి సమ్మేళనం ఆకట్టుకున్న కవుల కవిత్వాలు..
తెలంగాణ ప్రభుత్వ హయాంలో కవులు, కళాకారులకు గుర్తింపు..
కవిత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.. అర్థమయ్యేలా చేస్తుంది..
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి..
మేడ్చల్ , పెన్ పవర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గుర్తింపునిస్తూ గౌరవాన్ని కల్పిస్తున్నారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం స్వతంత్ర భారత్ అమృత్ మహోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ కవి సమ్మేళనానికి "స్వాతంత్ర స్ఫూర్తి" ని "ధీమ్" గా నిర్ణయించినట్లు తెలిపారు.75 వ స్వాతంత్ర భారత దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా 75 వారాల పాటు నిర్వహించనున్నట్లు తదనుగుణంగా స్వాతంత్ర పోరాట ఘట్టాలు గురించి నేటి తరం యువత, పిల్లలకు అవగాహన కల్పించుటకై స్వతంత్ర భారత అమృతోత్సవ కమిటీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగా శనివారం కవి సమ్మేళనం" నిర్వహించారు.. కవిత్వం అంటే ఉన్నత చదువులు చదివిన వారి నుంచి అక్షరం తెలియని వారికి అర్థమై అందులోని భావుకతను తెలియజేస్తోందని ఎన్నో మాటల ద్వారా చెప్పలేనిది ఒక్క కవిత్వం ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేసే ఘనత కేవలం కవులకే దక్కుతుందని అన్నారు. పండితుడి నుంచి పామరుడి వరకు కవిత్వం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు ఆచరిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులను ప్రోత్సహించేందుకు కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిందని దీనివల్ల ప్రతి ఒక్కరికి తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 47 మంది కవులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలతో పాటు పారితోషికాలను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, , జడ్పీ సీఈవో దేవసహాయం, డీఆర్వో లింగ్యానాయక్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ బల్రామ్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఎ .ఓ .వెంకటేశ్వరులు , సంబంధిత అధికారులు ,జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment