Followers

అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం

 అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 స్థానిక  మండల మహిళా సమాఖ్య కార్యాలయం లో ఎంపీడీఒ నాతి బుజ్జి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ శ్రీ చిర్ల జగ్గిరెడ్డి  ‌మాట్లాడుతూ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడపడుచుల మోములో సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో  గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆర్థిక క్లిష్ట పరిస్థితులలో కూడా గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారము మాట తప్పకుండా ఈరోజు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు  సున్నా వడ్డీ సొమ్ము జమచేసారని అన్నారు. కొత్తపేట నియోజకవర్గం లో  మొత్తం 6315 గ్రూపులలో ఉన్న 63150 మంది మహిళలకు 3కోట్ల 97 లక్షల రూపాయలను సున్నా వడ్డీ క్రింద ఈరోజు విడుదల చేశామన్నారు. అంతేకాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన మరియు పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపునేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పధకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ పధకాల అమలులో అగ్రగామిగా ఉందనీ, వీటిని ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనీ ఆయన ఆకాంక్షించారు. సంక్షేమ పధకాల ఫలాలు అందించడంలో ఎవరైనా ఉద్యోగుల వల్ల లేదా బ్యాంకు లలో ఏదైనా ఇబ్బంది వస్తే తన దృష్టి కి   రావాలన్నారు. మహిళలకు సున్నా వడ్డీ చెక్కు ను ,గృహ నిర్మాణం చేసుకుంటున్న మహిళకు 50 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆత్రేయపురం  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముదునూరి రామరాజు, మాజీ ఎంపిపి పీఎస్ రాజు, చిలువూరి రామకృష్ణం రాజు, వాడపల్లి దేవస్థానం మెంబర్ దావీదు, తాహశిల్దార్ ఎం రామకృష్ణ, డీఆర్‌డీఏ కోఆర్డినేటర్ అన్నపూర్ణ,రావులపాలెం ఎంపీడీఒ రాజేంద్ర ప్రసాద్, ఆలమూరు మండల పరిషత్ పరిపాలనాధికారి సురేంద్ర రెడ్డి నాలుగు మండలాల మహిళా సమాఖ్య నాయకురాళ్లు, సుబ్రహ్మణ్యం, స్వయం సహాయక సంఘాల మహిళలు, డిఆర్డిఎ సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...