పలాసలో కోవిడ్ వైద్య సేవలు విస్తృతం
పలాస, పెన్ పవర్
పలాస నియోజకవర్గంలో కోవిడ్ వైద్య సేవలు విస్తృత పరిచే ప్రక్రియలో భాగంగా పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, యస్.పీ.వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు హరిపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులలో మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు పర్యటించి కోవిడ్ ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి ఆసుపత్రుల సామర్థ్యం, అవకాశాలను పరిశీలించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రి, యస్.పీ.వీ ముల్టీ స్పెషలిటీ ఆసుపత్రులలో ఆక్సిజన్ సదుపాయం కల్పించి వీలైతే రెపటినుండే కోవిడ్ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తేవాలని అన్నారు. ఆయనతో పాటు పలాస, మందస తహశీల్దార్లు, మందస ఎంపీడీఓ, పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, పలాస మున్సిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment