జాతీయ స్థాయి అవార్డులు దక్కిన పచ్చని పల్లెలు
రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ స్వశక్తి కరణ్ పేరిట 2021 సంవత్సరానికి మూడు విభాగాల్లో ఆవార్డులు ప్రకటించాయి. వివిధ విభాగాల్లో తెలంగాణ కు 13 అవార్డులు వరించగా జిల్లా పరిషత్, మండల పరిషత్ గ్రామ పంచాయతీలకు అవార్డులను కేంద్రం ప్రకటించింది.ఉత్తమ గ్రామ పంచాయతీ లకు గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మోయినికుంట ,ఎల్లారెడ్డిపేట లోని హరిదాస్ నగర్ గ్రామాలకు ఉత్తమ జాతీయ పంచాయతీ రాజ్ 2021 అవార్డు లభించింది. కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ప్రధాన మంత్రి ఇవ్వవలసిన అవార్డుని కరోనా కారణంగా ఆ కార్యక్రమం రద్దు కావడం వల్ల పోస్ట్ లో సిరిసిల్ల జిల్లాకి పంపించగా, జిల్లా కలెక్టర్, కృష్ణ భాస్కర్, జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ల చేతుల మీదుగా హరిదాస్ నగర్ సర్పంచ్ తెడ్డు అమృత 2021 అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పేట్ జెడ్ పి టి సి చీటి లక్ష్మణ్ రావు , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , పంచాయతీ కార్యదర్శి లిదియ , ఎంపీడీఓ బింగి చిరంజీవి ,ఎంపీఓ వజీర్ అహ్మద్ ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం పాల్గొన్నారు.
No comments:
Post a Comment