మేయర్ ను కలిసిన బెహరా
మహారాణి పేట, పెన్ పవర్
మేయర్ ను కలిసిన బెహరా గోపాలపట్నం ప్రజా మాట విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని ఆమె కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జీవీఎంసీ కోఆప్షన్ మెంబెర్ బెహరా భాస్కరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రోజురోజుకు విజృంభణ కారణంగా వ్యాక్సిన్ పెంచాలని 91మరియు 92 వార్డులలో జరిగే అభివృద్ధి నిధులు పెంచాలని ముఖ్యంగా 91వ వార్డు పరిధి గోపాలపట్నం స్మశానం పనులు వేగవంతం చేయాలని అలాగే వ్యాక్సిన్ డోసులు పెంచి ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కంపర.సత్తిబాబు, వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment