Followers

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరంచాలి....

ప్రతి ఒక్కరూ మాస్క్  ధరంచాలి....

 చింతూరు, పెన్ పవర్ 

ప్రతి వ్యక్తి మాస్కు ధరించాలని, అప్పుడే కరోనా నియంత్రించబడుతుందని చింతూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దుర్గా విటల్ పేర్కొన్నారు. ఈ మేరకు చట్టి గ్రామంలో  శుక్రవారం  రవాణా శాఖ,  ఆటో ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్, ఆధ్వర్యంలో వాహనాల మీద వెళ్లే వాహనచోదకులకు కరోనా పై అవగాహన కల్పించారు. మాస్క్ లేని వాహనచోదకులకు మాస్కులు పంచిపెట్టారు. మాస్కులు పెట్టుకుంటే ఎక్కువ శాతం కరోనా రాకుండా నియంత్రించవచ్చునని అన్నారు. అలాగే కే.ఏ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. తరచూ చేతులను శుభ్రంగా సబ్బుతో గాని, శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆటో యూనియన్ నాయకులు  నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...