Followers

కే.పి.హెచ్.బి డివిజన్ మున్నూరుకాపు కోఆర్డినేటర్ నియామకం

 కే.పి.హెచ్.బి డివిజన్ మున్నూరు కాపు కోఆర్డినేటర్ నియామకం

కూకట్ పల్లి, పెన్ పవర్

కే.పి.హెచ్.బి డివిజన్ మున్నూరు కాపు సంఘం కోఆర్డినేటర్ గా ఆకుల. రాజారావు నియమితులయ్యారు. రాష్ట్ర కన్వీనర్ సర్ధార్ పుట్టం పురుషోత్తమ్, జిల్లా అధ్యక్షులు బుడుగుబావి హనుమంతరావు ఆదేశాల మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ బాశెట్టి నర్సింగ్ రావు మరియూ మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు రాజరావును కోఆర్డినేటర్ గా ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆకుల రాజారావు మాట్లాడుతూ తనమీద నమ్మకంతో పదవిని కేటాయించినందుకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గల కాపు కుల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో కాపు సోదరులందరు ఐక్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు.  ఈకార్యక్రమంలో పి.వెంకటేష్, శ్యామ్, దాడే. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...