గత పాలకులు వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయి..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
రు.5కోట్ల నిధులతో నిర్మించనున్న బంగారి గూడ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూమి పూజ
ఆదిలాబాద్ , పెన్ పవర్గత పాలకులు తెలంగాణ అభివృద్ధిని మర్చిపోయారని, తెలంగాణ సాధించుకున్న తర్వాత కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.స్థానిక బంగారి గూడ సమీపంలో రు 5కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా టిఆర్ఎస్ నాయకులతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలు మార్చే విధంగా విస్తృత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంతో సహా సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తీర్చడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని అన్నారు. కేవలం ఆర్ అండ్ బీ ద్వారానే నియోజకవర్గంలో రు.320 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రు.145 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి ప్రపోసల్స్ లో ఉన్నాయని వివరించారు. బంగారి గూడ అతి త్వరలోనే ఎడ్యుకేషనల్ హబ్ గా రూపు దిద్దుకోనుందని, వ్యవసాయ కళాశాలకు సైతం దాదాపు యాభై ఎకరాల భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. యాపల్ గూడ లో పోలిస్ బెటాలియన్ తో సహా రేణుక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని చెప్పారు. స్థానిక ప్రజలు ఏళ్ళుగా ఎదుర్కుంటున్న ఇబ్బందులు ఇకపై దూరం కానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, కమీషనర్ శైలజ, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, లతో పాటు పలువురు నాయకులూ, ఆర్ అండ్ బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment