జర్నలిస్టు శ్రీనివాస్ మృతికి సంతాపం
పెన్ పవర్, మందమర్రిక్యాతనపల్లి మునిసిపాలిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ మిలాప్ దినపత్రిక మంచిర్యాల జిల్లా స్టాపర్ గా విధులు కొనసాగిస్తూ కరోనా బారిన పడి స్వర్గస్తులైన కొండ్ర శ్రీనివాస్ మృతికి నివాళులు అర్పిస్తూ, స్థానిక అంగడి బజార్ వద్దగల అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి రామ కృష్ణ పూర్ పాత్రికియులు విచారం వ్యక్తం చేశారు. అనంతరం క్లబ్ సభ్యులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ వారియర్ గా పిలువబడే జర్నలిస్టులు కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది జర్నలిస్టులు చనిపోతున్నారని, అందులో భాగంగానే కొండ్ర శ్రీనివాస్ ఆత్మకు కు శాంతి చేకూరేలా క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించి, నివాళు లు అర్పించారు ఈ కార్యక్రమంలో కలువల శ్రీనివాస్, కలువల శంకర్, ఆరెంద స్వామి, సుభాష్, పిడి రాజేంద్రప్రసాద్,నాంపల్లి గట్టయ్య, సుదర్శన్, భరత్, నరేష్, సదానందం, కృష్ణమూర్తి ,సంతోష్, దండు సదానందం లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment