కొపంగి గ్రామంలో పారిశుద్ధ్య పనులు
మెంటాడ, పెన్ పవర్
మెంటాడ మండలంలో కరోనా ఉధృతి ఎక్కువ గా ఉండటం వలన మంగళవారం కొంపంగి గ్రామ పంచాయతీ గ్రామంలో సర్పంచ్ కూనీబిల్లి వెంకటరమణ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కొంపంగి గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేయించడం జరిగింది. గ్రామంలో ఉన్న సీసీ కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీత పనులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆయన అన్నారు. ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలనీ, అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని ఆయన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment