Followers

కీ"శే" నాగవెళ్ళి సాయి శ్రీశాంత్ వర్ధంతి సందర్భంగా సేవా జ్యోతిలో పండ్లు పంపిణీ

 కీ"శే" నాగవెళ్ళి సాయి శ్రీశాంత్ వర్ధంతి సందర్భంగా సేవా జ్యోతిలో పండ్లు పంపిణీ

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా"తాండూర్ మండల పరిధిలోని బోయపల్లిబోర్డు వేణు నగర్ వద్ద గల సేవా జ్యోతి శరణాలయంలో వరంగల్ కు చెందిన నరేందర్ సరిత దంపతుల కుమారుడు కీ"శే"నాగవెళ్ళి సాయి శ్రీశాంత్ వర్ధంతి సందర్భంగా కుమారుని జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన * ఎన్ స్ స్ ఫౌండేషన్ (నాగవెళ్ళి సాయి శ్రీశాంత్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో పండ్లు పాలు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు, అనంతరం శ్రీ స్వశక్తిభారత్ సేవాట్రస్ట్-సేవాజ్యోతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గజ్జెల్లి శ్రీదేవిమల్లేశం లు మాట్లాడుతూ సాయి శ్రీశాంత్ నిరంతరం ఆత్మజ్యోతిగా వారి అమ్మ నాన్న లు చేస్తున్న సేవా రూపంలో జీవించే ఉన్నారు,వారి ఆత్మకు శాంతి చేకూరాలని సేవా జ్యోతి నుండి కోరుతూ మాయొక్క ప్రార్ధన అని తెలిపారు, సేవా జ్యోతి  విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవ జిత్ మాట్లాడుతూ సాయి శ్రీశాంత్ మన మధ్య లేక పోయినా వారి అమ్మ నాన్న చేస్తున్న సేవలో ఎన్ స్ స్ జ్యోతి గా నిరంతరం వెలుగుతూనే ఉన్నారని వారి ఆత్మకు శాంతి కలగాలని వేడుతు భగవంతుని ప్రార్ధిస్తున్నానని అన్నారు, ఈ కార్యక్రమంలో సహా విద్యార్థి సేవా ప్రముఖ్ సర్వమాధవ్ జిత్,సేవికా ప్రముఖ్ నాగమణి, లక్ష్మీ , శరణాలయ మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...