మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇకలేరూ..
కరీంనగర్, పెన్ పవర్కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన ఎం,సత్యనారాయణ రావు ఇక లేరూ. కరోనా వైరస్ తో భాధపడుతున్న ఆయన నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అలనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ తో పాటు నెహ్రు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే ముక్కు సూటి మనిషి ఆయన. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంఎస్ఆర్ విసిరిన ఛాలెంజ్ ఉప ఎన్నికకు కారణమైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపీ స్థానం నుండి మూడు దఫాలు విజయం సాధించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గానూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగానూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంత కాలం పాటు ఆర్టీసీ ఛైర్మెన్ గా కూడ ఆయన పని చేశారు. కాంగ్రెస్ పార్టీ కి ఎమ్మెస్సార్ లేని లోటు ఎవరు తీర్చలేరు. అయితే గత కొద్ది రోజుల నుండి కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు ఆయన తుది శ్వాస విడిచారు.
No comments:
Post a Comment