కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. మాజీ మంత్రి గడ్డం వినోద్
బెల్లంపల్లి , పెన్ పవర్కరోనా రెండవ దశలో భారతదేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని, వాటిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరం గా విఫలం అయ్యాయని మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం వినోద్ అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ గతం నుండి గుణపాఠాలు నేర్చుకోలేని ప్రభుత్వపు నిర్లక్ష్య ధోరణి దేశ ప్రజల మెడకు ఉచ్చుల బిగుసుకుందని. మొదటి దశలో మన ఆసుపత్రులలో ఎదుర్కొన్న సమస్యల్ని మళ్ళీ ఏడాది గడిచాక కూడ అదే ఎదుర్కొనవల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వాల వైఫల్యంఅని, ఇప్పటికైనా దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరచి,మరింత ప్రాణ నష్టం జరగకముందే ప్రపంచ దేశాల సహాయం కోరాలని అన్నారు. దేశంలోని ఆసుపత్రులలో ఆక్సిజన్, బెడ్స్,వెంటిలేటర్ ల కొరత అధికంగా ఉందని,ఈ సమస్యలవల్ల దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య రోజురోజుకి అధికం అవుతుంది. మనకన్న చిన్న దేశాలు గతం నుండి గుణపాఠాలు నేర్చుకోని కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొంటుంటే మనం మాత్రం ఆసుపత్రు లలో కొరతల వల్ల ప్రాణనష్టం చూడాల్సివస్తోందని అన్నారు. కాబట్టి దేశ ప్రభుత్వం గ్లోబల్ కమ్యూనిటీని మనకి అవసరం అయ్యే పరికరాల కొరకు, వైద్య సహాయం కొరకు సహాయం కోరి దేశంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
No comments:
Post a Comment