మోడల్ సిటీగా తీర్చిదిద్దాలి...
విజయనగరం,పెన్ పవర్మోడల్ సిటీగా ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులుగా తమ కృషి తో పాటు, ప్రజల సహకారం కూడా ఎంతైనా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు 29వ డివిజన్ కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఉగాదిని పురస్కరించుకుని సోమవారం నాడు డివిజన్లోని మూడు వేల కుటుంబాలకు తన సొంత నిధులతో ఉగాది పచ్చడి కి సంబంధించి కిట్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి తొలి పండగ ఉగాది అని, ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేయడం వెనుక అర్థం, మనిషి జీవితంలో సుఖసంతోషాలు, కష్టనష్టాలు సమానంగా స్వీకరించాలన్న భావన అని అన్నారు. డివిజన్ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు.
ప్రజలు కూడా చైతన్యవంతులై తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరుగా చేసి పారిశుద్ధ్య సిబ్బంది వచ్చేటప్పుడు వారికి ఇవ్వాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి అన్నారు. ఈనెల 14వ తేదీ బుధవారం నాడు 29వ డివిజన్ పరిధిలో msn కాలనీ లో ఉన్న 32వ సచివాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ తీసుకోవాలన్నారు. అలాగే 15వ తేదీ గురువారం నాడు టౌన్ సెంటర్ లేఅవుట్ లో ఉన్న 35వ సచివాలయం లో వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, దీనిని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జీవితం అన్ని రుచుల కలయికగా పేర్కొనడానికి ప్రతిబింబిస్తోంది ఉగాది పచ్చడి అని అన్నారు. ప్లవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, పార్టీ నాయకులకు, మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ నాయకులు గుణ, సి ఎ శ్రీనివాస్, శంభా న శ్రీధర్, శ్రీమతి వల్లి, శ్రీమతి సంగీత కాళహస్తి, జోగి రాజు, రామకృష్ణ మాస్టారు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment