Followers

సింహాచల దేవస్థానం అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

 సింహాచల దేవస్థానం అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

సింహాచలం, పెన్ పవర్

సింహాచల దేవస్థానం అవకతవకలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా,విశ్వహిందూ పరిషత్ హైందవ సంఘాలు కోవిడ్  నియమ నిబంధనలతో  మంగళవారం ఉదయం సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సూర్య కళ ని  కలిసి ప్రశ్నించడం జరిగింది. సింహాచలం ప్రధాన ఆలయం లో ఉన్న ఆండాళమ్మ వారి బంగారు వడ్డాణం పై జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.2010నుంచి ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై ఎందుకు తనిఖీలు నిర్వహించలేదని ఈవో పై మండిపడ్డారు.ప్రతి మూడు సంవత్సరాలకు బంగారు ఆభరణాలు తనిఖీలను నిర్వహించ వలసి ఉంది కానీ ఇప్పటివరకు ఎందుకు నిర్వహించలేదని ఈవో ను ప్రశ్నించారు.సింహాచల దేవస్థానం పిఆర్ఓ ,మరియు ఫోటో గ్రాఫర్ ను ఏటువంటి సమాచారం ఇవ్వకుండా నియమించారో తెలియజేయాలన్నారు.ప్రతి నెల కిందిస్థాయి సిబ్బందికి జీతాలు చెల్లించలేని దేవస్థానం పి.ఆర్.వో ,ఫోటోగ్రాఫర్ కి సంవత్సరానికి 10 లక్షలు ఏ విధంగా చెల్లిస్తున్నారో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా  విశ్వహిందూ పరిషత్,ధార్మిక సంఘాలు హిందూ భక్తులకు  సమాధానం చెప్పాలని కోరారు.వెంటనే వీటిపై సమగ్ర విచారణ జరిపించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పూడిపెద్ది శర్మ,విశ్వహిందూ పరిషత్ ప్రముఖ కొణతాల శ్రీనివాస్,మీసాల రవీంద్ర,మరియు రామకృష్ణ భారతీయ జనతాపార్టీ నాయకులు మాధవి హైందవ  సంఘాలు  హిందూ భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...