సింగరేణిలో యువకార్మికులు అందరు కలిసి పోరాడాలి
మందమర్రి, పెన్ పవర్
సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లు,జనరల్ మజ్దూర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి,సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువ కార్మికులందరూ కలిసి పోరాడాలని తెలంగాణ బదిలీ వర్కర్స్, మజ్దూర్స్ ఫోరం అధ్యక్షులు కొప్పుల శ్రీనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్ లో ఫోరం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మంది సభ్యులు పాల్గొని, ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం నూతన అధ్యక్షుడిగా కొప్పుల శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల సాయి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా హర్షవర్ధన్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాలకు ఏరియా ఉపాధ్యక్షులను నియమించారు. అనంతరం అధ్యక్షులు కొప్పుల శ్రీనాథ్ మాట్లాడుతూ, త్వరలోనే సింగరేణి వ్యాప్తంగా బాయి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం 2014 డిపెండెంట్ ఉద్యోగాల కోసం కృషిచేసిన కొప్పుల శ్రీనాథ్, చెల్పూరి సతీష్, సాదుల సంతోష్ లను సభ్యులు సన్మానించారు. అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కోసం పోరాడి, ఇటీవల అకాల మరణం చెందిన ఆర్కే 7 ఉద్యోగి సుగుణకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు సారంగపాణి, సంతోష్ పాండే, పెండం సాయికృష్ణ, సంతోష్, రవి యాదవ్, కాదశి రమేష్, అవినాష్, సూర్యనారాయణ సూర్య నాయక్, సంతోష్ రెడ్డి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment