Followers

దిశ టిఎస్ అధ్యక్ష పదవి నుండి సుమతి మెుహన్ ను తొలగింపు

 దిశ టిఎస్ అధ్యక్ష పదవి నుండి సుమతి మెుహన్ ను తొలగింపు

పెన్ పవర్,  మల్కాజిగిరి

దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ మార్పులు చేస్తున్నట్టు జాతీయ దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ప్రొటెక్షన్ వ్యవస్థాపక చైర్మన్ వెంకటేశ్వరరాజు  పత్రిక  ప్రకటనలో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జిల్లా మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు, ప్రతి గ్రామ స్థాయి మండల స్థాయి వార్డ్ స్థాయిలో సమావేశాలు పెడుతూ మహిళ హక్కులు, మహిళ చట్టాలు పోక్సో, మరియు సీనియర్ సిటిజన్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ నేపధ్యంలో అనేక సేవా కార్యక్రమాలు కూడ సమాజంలో విస్తృత సేవలు చేసిన చదువురాని మహిళలను కూడ కమిటీలో తీసుకుని వారిని ఇంకా చైతన్య పరిచడమే ధ్యేయంగా పెట్టుకుని సంస్థ పని చేస్తుంది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ ప్రొటెక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ సభ్యుల సభ్యత్వం పెరిగి రికార్డ్ పనులు అధికమైనందుకు తెలంగాణ రాష్ట్ర దిష ప్రొటేక్షన్ వెల్పైర్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఉన్న శ్రీమతి సుమతి మోహన్ వయసు రీత్యా అనారోగ్యం కారణంగా ఈ అధిక పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడంతో, ఆర్గనైజేషన్ మరియు దిశ కుటుంబ సభ్యులకు ఎవరికి సహకరించక పోవడంతో వారిని అధ్యక్ష పదవి నుండి తొలగిస్తూ ఉతర్వ్యూలు జారీ చేశారు. వారి స్ధానంలో త్వరలోనే నూతన అధ్యక్షురాలి నియామకాన్ని ప్రకటిస్తామని వెంకటేశ్వర్ రాజు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...