Followers

ఎండాకాలంలో దొంగల బెడద ఎక్కువ.

 ఎండాకాలంలో దొంగల బెడద ఎక్కువ.

ఎల్లారెడ్డి పేట సర్కిల్ సీఐ మొగిలి

ఎల్లారెడ్డిపేట , పెన్ పవర్

ఎండాకాలం అయినందున దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ,ఎల్లారెడ్డిపేట సర్కిల్ సీఐ కె. మొగిలి, విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. రాత్రి ఇంటికి తాళాలు వేసి ఆరుబయట గాని స్లాప్ పైన నిద్రించరాదు ఒకవేళ బయట నిద్రిస్తే మీ విలువైన వస్తువులు మీ వెంటనే పెట్టుకుని నిద్రించ గలరు. మీ ఇంటికి తాళం వేసి నట్లు కనబడకుండా డోర్ కర్టెన్ కట్టుకో గలరు. మీ ఇంటిలో ఏమైనా  విలువైన వస్తువులు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్ర పంచుకోగలరు. మీ యొక్క విలువైన వస్తువులు మీ వెంటే ఉంచుకుంటూ జాగ్రత్త పడగలరు. మీ ఊరిలో కి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అనుమానాస్పద వ్యక్తులు గాని కనబడిన వెంటనే పోలీసులకు 100 కు డయల్ చేసి  వెంటనే సమాచారం అందించగలరని ఎల్లారెడ్డిపేట సీఐ కె. మొగిలి, కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...