ఉత్పత్తి సంఘాలతో రైతుల ఆర్ధికాభివృద్ధి
తాళ్లూరు మండలం దళారీల భారి నుంచి రైతులకు విముక్తి కలిగించడంతోపాటు వారి ఆదాయా న్ని పెంచేందుకు రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని మండల వ్యవసాయ శాఖ అధికారి బి ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ మందిరంలో రైతు సంఘాల సంస్థాగత నిర్మాణం పై వ్యవసాయ, వెలుగు అధికారులు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ రైతు ఉత్పత్తి సంఘాల వలన రైతులకు ఎన్నో ఉపయోగలు ఉన్నాయి అన్నారు. సంఘాల ద్వారా పంట ఉత్పత్తి, విక్రయాలు మరింత పెరుగుతాయి తద్వారా రైతులకు మేలు జరుగుతుంది అన్నారు. అనంతరం ఉత్పత్తి సంఘాల ఏర్పాటు పై బుక్ లెట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది నాగరాజు,రాజ సుందరి, వెంకట్రావు, సుధీర్, వెలుగు ఏపీయం వెంకట్రావు, సీసీ చంద్ర,పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment