Followers

కటారి ప్రవీణ్ మరియు దేవరాజ్ నాయుడుల అకాలమరణానికి సంతాపం తెలియజేసిన మహదేవ్

 కటారి ప్రవీణ్ మరియు దేవరాజ్ నాయుడుల అకాలమరణానికి సంతాపం తెలియజేసిన మహదేవ్ 

ఐరాల, పెన్ పవర్

కటారి ప్రవీణ్ మరియు దేవరాజ్ నాయుడుల అకాలమరణానికి సంతాపం తెలియజేసిన ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ్ సందీప్ చిత్తూరు  మాజీ మేయర్   కటారి హేమలత భర్త  కటారి ప్రవీణ్ మృతి  బాధాకరం. వారి ఆత్మకు శాంతి కల్గాలని భగవంతుని కోరుతున్నాము . అలాగే నాగం వాండ్ల పల్లి మాజీ ఎంపిటిసి మరియు మాజీ సర్పంచ్  దేవరాజ్ నాయుడు అకాలమరణానికి చింతిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు.  ఐరాల పాలేటమ్మ గుడి వద్ద ఐరాల ప్రజలు వారి ఇద్దరికీ సంతాప సభ ఏర్పాటు చేశారు. తరువాత  చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి  ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ్ సందీప్, ప్రసాద్ రాయల్, బాలాజీ, మధు రాయల్, కేశవులు, జలీల్ భాష, చిట్టి బాబు, చలపతి,. అర్ .రవి, చంద్ర, ఎ. రవి,  మోహన, మహబూబ్ బాషా, అబ్బాస్, బాబుల్లి, ఎస్. రఫీ మరియు ఐరాల - కాలవ గడ్డ, వి ఎస్ అగ్రహారం గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...