Followers

చిన్నబాబు కి స్పీకర్ తమ్మినేని పరామర్శ

 చిన్నబాబు కి  స్పీకర్ తమ్మినేని పరామర్శ

సంతబొమ్మాళి, పెన్ పవర్

సంతబొమ్మాళి పీఏసీఎస్ చైర్మన్, ఉమిలాడ  మాజీ సర్పంచ్,సీనియర్ వైసీపీ నాయకులు కిల్లి చిన్నబాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం కోసం శనివారం ఉదయం రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ నాయకులు రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.చిన్నబాబు మరణంజీర్ణించుకోలేకపోతున్నామని, మండల స్థాయిలో ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేమని స్పీకర్ అన్నారు. 

ఆయన కుటుంబీకులకు ఓదా ర్చారు. స్వగ్రామమైనఉమిలాడ పంచాయతీ డోకి కామన్నపేటకి చేరుకునిశనివారం ఆయన చిన్నబాబు చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నబాబు గత 1988 నుంచి 1996 వరకు సర్పంచ్, సంతబొమ్మాళి మండల రైతు నాయకుడుగా, 1997 నుంచి 2001 వరకు మేఘవరం డీసీ కమిటీ చైర్మన్ గా, 2019 నుంచి 2021వరకు కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గాను, నాలుగు సార్లు ఉమిలాడ సర్పంచ్ గాను వ్యవహరించారన్నారు. ఈయనతో పాటు సంతబొమ్మాలి మండల వైసీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...