Followers

ప్రమాదంలో మరణించిన కార్మికుడి కి న్యాయం చేయాలంటూ కమిషనర్ కు వినతిపత్రం

 ప్రమాదంలో మరణించిన కార్మికుడి కి న్యాయం చేయాలంటూ కమిషనర్ కు వినతిపత్రం..

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మున్సిపాలిటీ లో అధికారులు, పాలకవర్గం అవినీతి కారణంగా డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులను మున్సిపల్ సిబ్బందితో చేయించడం వల్ల శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు దశరథ మరణం మరియు మహిళా కార్మికురాలు లక్ష్మీ తీవ్ర గాయాలతో హాస్పత్రిలో చేరడం జరిగింది అని మేడ్చల్ బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షుడు ఆంజనేయులు మరియు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు అధికారం చేలాయించడమే కాకుండా అవినీతికి పాల్పడుతున్నారు అని విమర్శించారు. మృతి చెందిన కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు మరియు పుడూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తే చైర్మన్ మరియు కౌన్సిలర్ల భర్తలు తీవ్ర అసహనానికి లోనైనారు. కార్మికులు, వివిధ సంఘాలు, బీజేపీ పార్టీ పోరాటానికి స్పందించి ఎట్టకేలకు 10 గంటల నిరీక్షణ తరువాత మృతుని కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం చెల్లించడానికి ఆమోదం తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ ప్రాంగణంలో జరిగిన కార్మికుల నిరసనలో సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఆర్ఎస్ గౌడ్, ఒగ్గు వినోద్, శ్రీనివాస్ గౌడ్, టైలర్ రాజు, మల్లేష్ యాదవ్, మైసరి రాజు, శ్రీకాంత్ లవంగ, వేలూరి సంతోష్ గుప్తా, వంశీ కనుగంటి, వెంకట్, వంశీరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...