భారత ప్రభుత్వంచే వికలాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల పంపిణీ...
నార్నూర్, పెన్ పవర్ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో నార్నూర్ మండలం ఎస్సీ కాలనీ జీన్ గూడా వారికి వచ్చిన వైకల్యం గుర్తింపు కార్డులను శుక్రవారం అందించారు. ఈ కార్డులు వికలాంగులకు భారత ప్రభుత్వంచే గుర్తించ బడ్డ వికలాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డులు గా కార్డులో వికలాంగుల పేరు పుట్టిన తేదీ చిరునామా మరియు 16 అంకెల నంబరు వైకల్యం శాతం చిరునామా కలిగి ఉన్నాయి. అన్ని సీ డి పి ఓ ఉమాదేవి అన్నారు. ఐ సి డి ఎస్ వారికి కేటాయించిన ప్రత్యేక ఫోన్ యాప్లో వికలాంగుల పూర్తి వివరాలు మరియు వారికి కార్డు అందిస్తున్నా ఫోటోను ఫోన్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కర్మన్ కార్ పంచశీల, ఆడే సంగీత, జాదవ్ కవిత, లక్ష్మీ బాయి ఉన్నారు.
No comments:
Post a Comment