దోమ తెరలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పరచండి
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
నేడు అంతర్జాతీయ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ దోమ తెరలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పరచాలని భద్రగిరి ఇంచార్జి మలేరియా సభ్ యూనిట్ అధికారి ఎస్. నారాయణ రావు తెలిపారు. శనివారం ఆయన గుమ్మలక్ష్మీపురం లో విలేకర్లతో మాట్లాడుతూ, నేడు ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మ నాథ్ ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఇంటికి అందించిన దోమ తెరలను సక్రమంగా వాడేలా అవగాహన పరచాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయని, అయినా మలేరియా జ్వరాల పై ప్రజలు పూర్తి అవగాహన పరచుకొని దోమ తెరలను రాత్రి వేళల్లో కొట్టుకొని నిద్రించాలని అన్నారు. ఈ మేరకు పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దోమ తెరలను పంపిణీ చేశామని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయా దోమ తెరలను విద్యార్థులు సక్రమంగా వినియోగించడంపై కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రగిరి మలేరియా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment