Followers

నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్..

 నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్..

సునీల్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలి

 పిసిసి సభ్యులు గూగులోతు దసురు నాయక్...

కేసముద్రం,  పెన్  పవర్

 కేసముద్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మూడు రోజుల క్రితం బోడ. సునీల్ అనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడంలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది. ఈ సమావేశంలో సునీల్ కు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పీసీసీ సభ్యులు గూగుల్ లోతు దసురు నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ప్రజలను యువకులను మోసం చేసి అధికారంలోకి వచ్చాక నీళ్లు పేరు చెప్పి విధులను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి  అవినీతికి తెరతీశారు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట తప్పి నేను చెప్పిన అని నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ ఉద్యోగస్తులపదవీ విరమణ వయస్సును 58 సంవత్సరముల నుండి 61 సంవత్సరాల కు పెంచి నిరుద్యోగ యువతను నిరాశకు లోను చేశాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు బోడ సునీల్ మరణం ప్రభుత్వ హత్యగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యువత పోరాటం చేసిన విధంగానే ఈ నాటకాల కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పే వరకూ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసే వరకు మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ఇచ్చినట్లుగానే యువతకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉంటుంది. నిరుద్యోగ యువతకు ముఖ్యంగా విన్నపము ఏమనగా కెసిఆర్ నియంతృత్వ విధానాలను ఎండగట్టి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చే వరకు పోరాటం చేద్దాం దయచేసి యువకులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కుటుంబాల లో కడుపు కోత పెట్టొద్దని దండం పెట్టి చెబుతున్నా నియంతృత్వ ప్రభుత్వంపై అందరం కలిసికట్టుగా పోరాడుదాం, బోడ సునీల్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తోటవెంకన్న మండల అధ్యక్షులు బీరం గోపాల్ రెడ్డి ఎంపీటీసీలు గంట అశోక్ రెడ్డి . బాలునాయక్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు చిరగని సారయ్య అయూబ్ ఖాన్, సబ్ స్టేషన్ సర్పంచ్ వెంకన్న మైనార్టీ సెల్ రఫీ ఖాన్ గండి శ్రీనివాస్ గోపాల వెంకట రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...