Followers

పార్కు స్థలాన్ని కబ్జా చేశారు

 పార్కు స్థలాన్ని కబ్జా చేశారు - బీజేపీ నాయకులు.

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కాలి స్థలాలు మరియు పార్కు స్థలాలే టార్గెట్ గా భూ మాఫియా చెలరేగిపోతుందని బీజేపీ మేడ్చల్ మున్సిపల్ నాయకులు ఆరోపించారు. ఈ మాఫియాకు చెందిన నాయలులే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములను చేరపడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక మేడ్చల్ చెక్ పోస్ట్ లోని సర్వే నెంబర్ 882 లో గ్రామపంచాయతీ పర్మిషన్ తో 18 ఎకరాల విస్తీర్ణంలో శ్రీసాయి నిలయ రెసిడెన్సీ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్లోని సుమారు 1800 గజాల పార్కు స్థలాన్ని గత రెండు సంవత్సరాల నుండి కబ్జాకు పాల్పడడానికి ప్రయత్నిస్తూ దాన్ని అడ్డుకోబోయిన కాలనీ వాసులను రౌడీలతో బెదిరింపులకు పాల్పడిన సందర్భాలు అనేకం. దీనిపై కాలనీ వాసులు పోలీస్ కమిషనర్, ఏసీపీ, సీఐ లకు పిర్యాదు చేసినా కూడా పైస్థాయి నుండి వస్తున్న ఒత్తిళ్ల వల్ల సమస్యకు పరిష్కారం లభించలేదు. ఇట్టి కబ్జాలను వెంటనే అరికట్టి పార్కు స్థలం చుట్టూ ప్రహరిణి ఏర్పాటు చేసి పార్కులో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కాలనీ వాసులకు అప్పగించాలని మరియు వెంచర్లో మురుగునీటిని బైటకి పంపే వ్యవస్థ లేకపోవడం వల్ల కాలి ప్లాట్లలో నీరు చేరి చుట్టుపక్కల ఇళ్ల వారికి దుర్గంధం వేదజల్లుతూ ఆరోగ్యానికి హానికారకం అవుతుందని ఇట్టి సమస్యకు కూడా వెంటనే పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఆర్ శ్రీనివాస్ గౌడ్, సర్వేశ్వర్ రెడ్డి, సీఎం రాజు, వినోద్ యాదవ్, మున్సిపల్ ఉపాధ్యక్షులు సీహెచ్. శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ యాదవ్, రవి, కపిల్ రాజ్, అర్జున్, వంశీ కానుగంటి, ఆనంద్, వంశీదర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...