Followers

అనధికార గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా

 అనధికార గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ  కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా

చర్లపల్లి కాలనీల సమాఖ్య ఆధ్వర్యంలో బైఠాయించిన కాలనీల వాసులు

అమూల్య హోమ్స్ ఇతర అధికార గేటెడ్ కమ్యూనిటీల పై చర్యలకు డిమాండ్

అక్రమ గేట్లపై చర్యలు తీసుకుంటాం...శంకర్ కాప్రా డిసి.

పెన్ పవర్,  మల్కాజిగిరి

కాప్రా సర్కిల్ పరిధిలో అనధికార గేటెడ్ కమ్యూనిటీల పేరుతో రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న గేట్లను తొలగించాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న గేట్లను తక్షణమే తొలగించాలని నినదిస్తూ చర్లపల్లి కాలనీల సమాఖ్య  ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మా రోడ్లు మాకు కావాలి అమూల్య హోమ్స్ , భవాని నగర్ రోడ్ లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న గేట్లను తొలగించాలి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ లు స్పందించి ఆక్రమణలకు పాల్పడుతున్న సంస్థలు వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనధికార గేట్లపై చర్యలు తీసుకోవాలంటూ చర్లపల్లి కాలనీల సమాఖ్య ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనలు గురువారం  కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు ఉపక్రమించడం జరిగింది.  ఈ సందర్భంగా చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ కాప్రా సర్కిల్ లో గేటెడ్ కమ్యూనిటీల విష సంస్కృతి అధికారుల నిర్లక్ష్యంతో పెట్రేగి పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు ఏ మాత్రం తాత్సారం చేయకుండా అక్రమ గేట్లను తొలగించాలని లేనియెడల కాప్రా సర్కిల్ కార్యాలయంను ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన టిఆర్ఎస్, బిజెపి, టిడిపి పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎవరికివారు ఇష్టానుసారంగా గేట్లను ఏర్పాటు చేసుకుని పోతే పక్క కాలనీలకు వెళ్లే మార్గాలు మూసుకుపోయి మానవ సంబంధాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమూల్య హోమ్స్ గేట్లు మూసివేయడంతో కోవిడ్ పరీక్షలకు వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వెళ్లాలంటే జమ్మిగడ్డ దాని పరిసర అనేక అనేక కాలనీల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని జమ్మిగడ్డ, న్యూ వాసవి నగర్ వాసులు గగన్ కుమార్ మరియు చంద్రశేఖర్ లు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కిల్ కార్యాలయం ఎదుట జరుగుతున్న ఆందోళనలు స్పందించిన కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ కార్యాలయం బయటకు వచ్చి ధర్నా చేస్తున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనధికారిక గేటెడ్ కమ్యూనిటీ లపై  న్యాయపరమైన సలహాలు తీసుకుని సాధ్యమైనంత త్వరలో వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించి తమతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మరి మోహన్ రెడ్డి,  గణేష్ ముదిరాజ్, రాములు యాదవ్, కొండూరి మురళి పంతులు, నీరుకబాబాబు,సతీష్ బాబు, లక్ష్మీనారాయణ,  బి జె ఆర్ కాలనీ అధ్యక్షులు రహీం, చక్రిపురం  అధ్యక్ష -కార్యదర్శులు మొగిలి రాఘవరెడ్డి,ఆంజనేయులు, మీనాక్షి నగర్, వైష్ణవి ఎంక్లేవ్ ల అధ్యక్షులు సురేష్ గుప్తా,గంప కృష్ణ, శివ సాయి నగర్ ఉపాధ్యక్షులు కాసుల సురేష్ గౌడ్ , శుభోదయ కాలనీ సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...