ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం..
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘ చర్చ
అభివృద్ధి పనులకు విన్నపాలు
విన్నపాలు అన్నింటికీ శాశ్వత పరిష్కారం అన్న సీఎం
ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ పై ప్రశంసల జల్లు
సత్యవేడు, పెన్ పవర్
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తో కలిసి సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు ముందుగా ముఖ్యమంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలో అత్యధికంగా 73 శాతం పైచిలుకు పోలింగ్ నమోదు కావడం , ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే మెజారిటీ పైన సుదీర్ఘంగా చర్చించారు, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై ముఖ్యమంత్రికి విన్నవించారు, ముఖ్యంగా దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణం నిధుల కేటాయింపు, బుచ్చినాయుడుకండ్రిగ చక్కెర కర్మాగారం, నిండ్ర చక్కెర కర్మాగారం కార్మికుల, రైతుల బకాయిలు చెల్లింపు, నియోజకవర్గంలో పలు పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల మంజూరు తదితర విషయాలు ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి విన్నపాలు అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్యవేడు లో అత్యధికంగా పోలింగ్ కావడంలో కీలక పాత్ర పోషించిన, మంత్రి నాని, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం, స్థానిక వైసిపి నాయకులు, అధికారులు ప్రజలపై ప్రశంసల జల్లు కురిపించారు. సత్యవేడు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు..
No comments:
Post a Comment