నిషేధిత గుట్క ప్యాకెట్లు పట్టివేత
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్ప్రభుత్వం నిషేధించిన 1,20,000/- రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు చంద్రంపేట గ్రామంలో ఎల్లంకి శ్రీనివాస కిరాణా షాపులో తనిఖీ చేయగా నిషేధిత గుట్కా లభ్యమైంది. నిషేధిత గుట్కా విలువ అందాజ ఒక లక్ష ఇరవై వేల రూపాయల (1,20,000/-) విలువ గలదు. తగు చర్య నిమిత్తం సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఎల్లంకి శ్రీనివాస్ మరియు నిషేధిత గుట్కా ను అప్పగించారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు, అమ్మడం మరియు ఇండ్లల్లో దాచి పెట్టడం నేరం మరియు గ్రామాలలో గుట్కా, మద్యం, ఎవరైనా అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. గ్రామాలలోని ప్రజలు మరి యువకులు ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 కు, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ టాస్క్ లో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ వెంకటేశ్వర్లు, రాంరెడ్డి సిబ్బంది తిరుపతి బాబు రమేష్, తిరుపతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment