శ్రీ రామగిరి కత్తులూరు మార్గమధ్యలో పడి ఉన్న పెద్ద వృక్షం తొలగింపు
వి.ఆర్.పురం, పెన్ పవర్
వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుండి కత్తులూరు వెళ్లే రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం పడి సంవత్సరం కాలం అయింది. ఆ వృక్షం గురించిఎవరూ పట్టించుకోలేదు. కత్తులూరు గ్రామానికి ఎవరైనావెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతూ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీ రామగిరి గ్రామపంచాయతీ సర్పంచ్ పులి సంతోష్ కుమార్ కత్తులూరు గ్రామ ప్రజలు పడే బాధ చూసి వెంటనే దారికి అడ్డంగా ఉన్న వృక్షాన్ని జె.సి.బి. సహాయంతో తొలగించడం జరిగింది. దానితోపాటు ఒక కల్వర్ట్ దగ్గర వర్షాకాలం రోడ్డు గండి కొట్టి వేయడంతో ఎక్కడ గుంతలు ఏర్పడ్డాయి. జె. సి. బి. ద్వారా రోడ్డు మరమ్మతులు చేసినారు. రహదారికి ఇరువైపుల మూసుకుపోయిన తుమ్మ చెట్లను పొద లను తొలగించడం జరిగింది. కత్తులూరు గ్రామ ప్రజలు శ్రీ రామగిరి గ్రామపంచాయతీ సర్పంచ్ పులి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment