ఉపాధ్యాయురాలు ఆకస్మిక మృతి
పెన్ పవర్,ఆలమూరు
ఆలమూరు మండలం జొన్నాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న కడలి నిశిత ఆకస్మిక మృతి చెందారు. ఈమె ఆలమూరు మాజీ ఎంపీటీసీ, ప్రముఖ న్యాయవాది కాండ్రేగుల భీమశంకరం గారి అర్ధాంగి. ఆలమూరు మండలం మడికితో పాటు అనేక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసి ఎందరో విద్యార్థులకు ఉన్నత బాటలు వేసిన ఈమె మృతి పట్ల ఎంఈఓ రామచంద్ర రావు, ఎంపీడీవో జేఏ ఝాన్సీ, పలు ఉపాధ్యాయ సంఘాలు, పలువురు ఉపాధ్యాయులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment