గ్రామం నడిబొడ్డున కరోనా పరీక్షలు
పరీక్షలను వ్యతిరేకించిన స్థానికులు
భయాందోళనలో గ్రామస్తులు
జగన్మోహిని కేశవ స్వామి ఆలయ పరిసర ప్రాంతంలో
పెన్ పవర్, ఆత్రేయపురం
ర్యాలీ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదించారు ఇటీవల పాత భవనం కూల్చి వేసి కొత్త భవనం నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా పి.హెచ్.సి వైద్య సేవలను గ్రామం నడిబొడ్డున ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం పక్కన ఉన్న సత్రములో వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వే ఉదృతి పెరగడంతో లక్షణాలు కనిపించిన వారు పరీక్షలు కోసం ఇక్కడకు రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం వందలాది సంఖ్యలో అనుమానితులు బారులుతీరారు వీరిని వైద్య సిబ్బంది అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానిక నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని వైద్యులు చెబుతున్నారు. ఊరి మధ్యలో అది కూడా ఆలయం సమావేశంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వాలని వాపోతున్నారు. కరుణ రోగుల నుండి మిగిలిన వారి వ్యాప్తి చెందకుండా గ్రామానికి దూరంగా శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ కరోనా పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు
No comments:
Post a Comment