Followers

బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

 బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు.. 

దేశ అభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి..ఎమ్మెల్యే కేపి వివేకానంద్.. 

వివక్షతను జయించిన మహనీయుడు జగ్జీవన్ రామ్.. 

1930లో సత్యాగ్రహంలో పాల్గొని..బ్రిటిష్ వారిని ఎదురించిన స్వాతంత్ర్య సమరయోధుడు.. 

27 ఏండ్ల వయసులోనే శాసనమండలి సభ్యునిగా ఎన్నిక.. 

రక్షణశాఖ..ఆరోగ్య.. రైల్వేశాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయం.. 





జీడిమెట్ల, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని శివాలయ నగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధునిగా, దూరదృష్టి గల నాయకునిగా బాబు జగ్జీవన్ రామ్ దేశ సేవలో తరించారని కొనియాడారు.. రాజకీయ మేధావిగా దేశ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం మరువలేనిదని గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ నిజమైన ప్రజాస్వామ్యవాది అని, సమాజంలోని పేద, అణగారిన, బలహీన వర్గాల అభివృద్ధికి వారు ఎంతో కృషి చేశారన్నారు. 35 సంవత్సరాలకే కేబినెట్ మంత్రిగా దేశానికి సేవలందించి, సంస్కరణల అమలులో తనదైన ముద్రను బాబు జగ్జీవన్ రామ్ చూపారన్నారు. దేశంలో హరిత విప్లవం అమలు చేయటంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో  మన్నె రాజు, సోమేష్ యాదవ్, వెంకట స్వామి, దళిత సంఘాల ఐక్య వేదిక సభ్యులు ఏసు రత్నం, లక్ష్మణ్, జేమ్స్, బుచ్చన్న, అశోక్, భాస్కర్, సాయి బాబా, సత్యనారయణ, సత్తయ్య, ఎల్లయ్య, ప్రశాంత్, బాలయ్య, శంకర్, డేవిడ్, భిక్షపతి, జానయ్య తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...