పారిశుధ్యానికి పెద్దపీట...
మెంటాడ, పెన్ పవర్
మెంటాడ మండలంలోని బడే వలస గ్రామములో ముమ్మరంగా వీధి దీపాలు మరమ్మత్తులను, కాలువల్లో పూడికలు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సర్పంచ్ ప్రతినిధి మీసాల గురు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని ఈ నేపథ్యంలో గ్రామంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు.
గ్రామంలో వీధిలైట్లు సమస్య, తాగునీటి సమస్య, పారిశుద్ధ్య పారిశుద్ధ్య సమస్య ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కోవిడ్ రెండో దశ చాలా తీవ్రంగా ఉందని గ్రామస్తులు, యువకులు, వృద్ధులు మధ్యవయస్కులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డ లేమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని ఆయన గ్రామస్తులు సూచించారు. మాస్కులు ధరించి, బహుదూరం పాటించాలని ఆయన స్పష్టం చేశారు. కరోనా నుంచి మనకు మనమే కాపాడుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment