Followers

నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణం..

 నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణం..

 పెన్ పవర్,  కాప్రా

నిరాడంబరంగా సీతారాముల కళ్యాణం.. కుషాయిగూడ శ్రీ పద్మావతి వేంకటేశ్వర   దేవాలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా నిరాడంబరంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.  కరోనా రెండవ దశ వేగంగా ప్రబలుతున్న దృశ్య రాష్ట్ర ప్రభుత్వ నియమాల అనుసారం ఆలయ అర్చకులు, సిబ్బంది సమక్షంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.  అనంతరం ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు లక్ష్మణాచార్యులు, రమణాచార్యులు, నారాయణాచార్యులు, వేణుగోపాలాచార్యులు, సీతారామ శర్మ, రాఘవాచార్యులు, శేషాచార్యులు, ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, శ్రీనివాసు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...