కరోనా భయంతొ తగ్గిన పుచ్చకాయ ల వ్యాపారం
నష్టపోతున్న పుచ్చకాయ రైతులు, వ్యాపారస్తులు.
కేసముద్రం, పెన్ పవర్కడుపులో చల్లదనం మరియు ఆరోగ్యంను కల్గిస్తు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తిన దగిన వస్తువు భానుడి ప్రతాపం నుండి కాపాడే పుచ్చకాయ నేడు కొనే వారు కరువై రోడ్ల వెంబడి కుప్పలు, తెప్పలు గా దర్శనమిస్తూ,కరోనా భయంతో కొనేవారు కరువవడంతో చిరు వ్యాపారులు మనోవేదన చెందుతున్నారు. గత సంవత్సరం కూడా ఇదే సీజన్లో కరోనా వైరస్ విజ్రుంభించిన తరుణంలో వ్యాపారం లేక నష్టపోయమని, మళ్ళీ ఈ సంవత్సరం ఇదే తరుణంలో వైరస్ వ్యాపించిన సందర్బంగా ప్రజలు బయపడి బయటకి రాలేకపోవడం వలన పుచ్చకాయ ల వ్యాపారం తగ్గి తాము తీవ్రంగా నష్ట పోతున్నామని పుచ్చకాయ ల వ్యాపారస్తులు మనో వేదన చెందుతున్నారు
No comments:
Post a Comment