Followers

ఎవరక్కడ? ఎవరూ లేరిక్కడ...

 ఎవరక్కడ? ఎవరూ లేరిక్కడ... 

సంతబొమ్మాళి, పెన్ పవర్

డాక్టర్ గారు ఉన్నారా! లేరు డిప్యూటేషన్ పై వెళ్లారు, మేడం గారు ఉన్నారా! లేరు డిప్యూటేషన్ పై వెళ్లారు. పోని స్టాఫ్ నర్స్.. చెప్పాం కదండీ అందరూ డిప్యూటేషన్ పై వెళ్లారని.ఇది సంతబొమ్మాళి మండలంలో దండుగోపాల పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు.. అలాంటి పల్లెల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురైతే వైద్యం చేసి సరైన మందులు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మండల కేంద్రాలతో పాటు పలు మేజర్‌ పంచాయతీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ మండలంలో దండుగోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, సిబ్బంది లేక ప్రజలకు ఎలాంటి సేవలు అందడం లేదు. 

ఉన్నవారికి డిప్యూటేషన్ పై  పంపించడంతో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది.  దీంతో నర్సులు, ఎఎన్‌ఎంలే సేవలందిస్తున్నారు.  దీంతో గ్రామంలో ఆసుపత్రి ఉన్నా వైద్యం కోసం సమీపంలోని పట్టణానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.  ఇక్కడ పనిచేసే వైధ్యాధికారిని ఆర్ స్వాతి   డిప్యూటేషన్ పై వైజాగ్ వెళ్లగా, హరికృష్ణ ఎల్ డి కంప్యూటర్ డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నాడు. ఎంపిహెచ్ఈఓ శేషుబాబు డిప్యుటేషన్ లో మురపాక ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. స్టాఫ్ నర్స్ సావిత్రి డిప్యూటేషన్ లో నౌపడా పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు డిప్యూటేషన్ లో విధులు నిర్వహించడం తో ఇక్కడ వైద్య సేవలు కరువు అవుతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఆస్పత్రికి రోజు ఎంతో మంది రోగులు వస్తుంటారు. వైద్యులు సిబ్బంది కనబడక తీవ్ర నిరాశతో వెనుతీరుగతున్నారు.  ఈ ఆస్పత్రిలో ఒక పి హెచ్ ఎన్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఆరోగ్య కేంద్రానికి డ్రాయింగ్ ఆఫీసర్ గా డాక్టర్ సిహెచ్ కోదండరావు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ కేవలం 270 మందికి మాత్రమే వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్ లో ఈ ఆరోగ్య కేంద్రం చాలా వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. కేవలం కోవిడ్ వ్యాక్సినేషన్ కు ప్రత్యేకంగా జలుమూరు పిహెచ్సి వైద్యాధికారి వంశీకృష్ణ ను నియమించారు. ప్రస్తుతానికి ఆ వైద్యాధికారి కూడా సెలవు లో ఉన్నట్లు తెలుస్తోంది. దండుగోపాలపురం పీహెచ్సీ లో సిబ్బంది కొరత, వైద్యులు లేకపోవడంతో,  డిప్యుటేషన్ లో ఇబ్బంది ఎక్కువగా ఉండటంతో మండల ప్రత్యేక అధికారి పివీ శ్రీనివాస్ ను వివరణ కోరగా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యలను తీసుకు వెళ్తానని తక్షణమే సిబ్బందిని వెనక్కి రప్పించేలా చర్యలు చేపడతానని అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...