Followers

పరీక్షలు వాయిదా వేయండి...

పరీక్షలు వాయిదా వేయండి...



విజయనగరం, పెన్  పవర్


కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను వెంటనే  వాయిదా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కె.దయానంద్ విజ్ఞప్తి చేసారు. శనివారం నాడు ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులతో కలిసి ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతీ రోజూ రాష్ట్రంలో పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, కరోనా తో మరణించిన వారి సంఖ్యా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికే ఒకటి నుండి తొమ్మిది  తరగతుల విద్యార్థులకు తరగతులు రద్దుచేసి ప్రమోట్ చేయడం హర్షనీయమని అయితే పది, ఇంటర్ విద్యార్థులకు క్లాస్ లు నిర్వహించి, పరీక్షలు పెడతామనడం సరికాదని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఇటు విద్యార్థులు, అటు  తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారని అన్నారు. మే ఒకటి నుండి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ టీకా ఉచితంగా వేస్తామని ప్రభుత్వం  ప్రకటించిందని, మరో పక్క పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని అంటుందని. దీంతో ఈ రెండు క్లాస్ లకు చెందిన విద్యార్థులు టీకా వేసుకునేందుకు అనర్హులు కాగా పరీక్షలకూ హాజరు కావాల్సి ఉందని దీంతో విద్యార్థులు కరోనా బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి తర్వాత తరగతులకు ప్రమోట్ చేశాయని, ఈ రాష్ట్రంలో  పరీక్షలు రద్దు చేయకపోయినా కరోనా అదుపులోకి వచ్చేంతవరకు వాయిదా వేయాలని కోరారు. పరీక్షలు కన్నా ప్రాణాలు విలువైనవని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి బూరాడ శ్రీనివాస్, నియోజకవర్గం కన్వీనర్ తిప్పాన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...