తడకల గుడిసెలో రేషన్ షాప్ పట్టించుకోని అధికారులు.
కోతుల పాలు అవుతున్న రేషన్ సరుకు.
జంగవాణి గూడెం రేషన్ డీలర్ ఆవేదన.
పెన్ పవర్, పెద్ద గూడూరు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవాణి గూడెంలో ఈక యాకరాణి (షాపు నెంబర్ 22) ప్రభూత్వం ఇచ్చిన ఇల్లు నిర్మాణం పూర్తి కాకపోవటంతో వెదురు బొంగులతో తడకలు, తలుపులు నిర్మించుకొని, చూట్టు పరదాలు ఏర్పాటు చేసుకోని యాకరాణి అనే రేషన్ డీలర్ రేషన్ బియ్యం అమ్ముతున్నారు. అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికి సగం రేషన్ బియ్యం కోతులపాలవుతుంది. వీధి కుక్కలకు కూడ ఈ బియ్యం పైనే కన్ను. వర్షం వస్తే బియ్యం నీటిపాలు అవుతుందని డీలర్ యాకరాణి వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని ఇకనైన పట్టించుకోని నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు.
No comments:
Post a Comment