మంచి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
పరవాడ,పెన్ పవర్
79 వ వార్డు పరిధిలో గల అన్ని ప్రాంతాల్లో ఘత రేడు సంవచ్చరాల క్రింద అమృత పధకం క్రింద ఇచ్చిన త్రాగునీటి ఇంటింటి కనెక్షలకు నీటి సరఫరా జరిగేలా సత్వరమే చర్యలు తీసుకోవాలి అని జివిఎంసి కమిషనర్ సృజ నాకు 79 వార్డు కౌన్సిలర్ రౌతు శ్రీనివాస్ వినతిపత్రం అందించారు.లంకెలపాలెం పరిధిలోని గొల్లపేట,శ్రీరామ్ నగర్,శ్రీరంగం కాలనీ,లంకెలపాలెం జక్షన్,శ్రీ మరిడిమాంబ కాలనీ,అప్పీకొండ వారి విధి,గెంజి పేట,జాజులవాని పాలెం ప్రాంతాల్లో వారికి 2 సంవత్సరాల క్రిందట అమృత త్రాగు నీటి పధకం క్రింద కనెక్షన్లు ఇచ్చినా వారికి సక్రమంగా నీటిసరఫరా కావడం లేదు అని ప్రస్తుత ఎండాకాలం లో ప్రజలు త్రాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు అని శ్రీను తెలియజేసారు. ట్యాంకర్లతో నీటిసరఫరా అనేది ఖర్చుతో కూడుకున్న పనే కాకుండా అందరికి నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు అని తెలియజేసారు.సత్వరమే కుళాయిల ద్వారా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రౌతు శ్రీను కోరారు.
No comments:
Post a Comment