Followers

వై.ఎస్.ఆర్. భీమా చెక్కుల పంపిణీ

 వై.ఎస్.ఆర్. భీమా  చెక్కుల పంపిణీ

విశాఖ ద్వారకానగర్,పెన్ పవర్ 

 చోడవరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్. భీమా పథకానికి చెందిన లబ్ది దారులకు ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్బంగా శాసన సభ్యులు ధర్మశ్రీ  మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల్లో కల్లా చోడవరం నియోజకవర్గ మండలాలకు అత్యధికంగా ఈ పథకానికి గ్రాంట్లు కేటాయించారని సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం. డి. ఓ. శ్యామ్ సుందర్ , వై.ఎస్.ఆర్.సి.పి. ముఖ్య నేతలు బొడ్డు శ్రీరామ్మూర్తి ,  దొండా రాంబాబు , గొర్లె సూరిబాబు, చందూ రాంబాబు ,  మరియు చోడవరం , రావికమతం , రోలుగుంట , బుచ్చయ్యపేట  గ్రామాల సర్పంచులు , పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...