Followers

‘పింక్‌’ లింక్‌ మీకూ వచ్చిందా..!

‘పింక్‌’ లింక్‌ మీకూ వచ్చిందా..!

న్యూస్ డెస్క్, పెన్ పవర్

వాట్సాప్‌ ఏం రంగులో ఉంటుంది అంటే ఆకుపచ్చ రంగులో ఠక్కున సమాధానం వచ్చేస్తుంది.  అయితే కొన్నిసార్లు కొత్త రంగులో వాట్సాప్‌ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజం కావు, వాట్సాప్‌కి వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్‌ నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... మరో ఫేక్‌ లింక్‌ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది కాబట్టి. అసలు ఏంటా లింక్‌.. ఎందుకు వస్తోంది...ఫేక్‌ వాట్సాప్‌ లింక్‌లు మీకు కూడా గతంలో వచ్చుంటాయి. వాటిని క్లిక్‌ చేసి కొంతమంది ఇబ్బందులు పడి ఉంటారు. అలా ‘పింక్‌ వాట్సాప్‌’   అంటూ ఓ లింక్‌ ఇటీవల వైరల్‌ అవుతోంది. అది అచ్చంగా వాట్సాప్‌ లింక్‌లానే ఉంటుంది  కానీ, వాట్సాప్‌కీ, దీనికీ సంబంధం ఏమీ ఉండదు. ఈ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీ పేరు, మొబైల్‌ నెంబరు తదితర వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత ఆ పేజీ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ ఉండదు. అయితే మీ సమాచారం మొత్తం అగంతుకుల చేతికి చేరిపోతుంది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...