ప్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కు కోవిడ్ వ్యాక్సిన్
చిత్తూరు, పెన్ పవర్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలో ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. వివిధ ప్రభుత్వశాఖల్లో వివిధ కారణాలతో గతంలో వ్యాక్సిన్ వేయించుకోని ప్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ ను గుర్తించి వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించారు. నగరపాలక పరిధిలో సత్యనారాయణపురం, చవటపల్లి, కాజూరు అర్బన్ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, ప్రజలు కలిపి 2,013 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేశారు.
No comments:
Post a Comment